కాపీరైట్ కేసులో హీరో రక్షిత్ శెట్టికి కోర్టు ఫైన్

77చూసినవారు
కాపీరైట్ కేసులో హీరో రక్షిత్ శెట్టికి కోర్టు ఫైన్
కన్నడ హీరో, దర్శకుడు రక్షిత్ శెట్టికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కాపీరైట్ కేసులో రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని కోర్టు శనివారం ఆదేశించింది. ‘బ్యాచిలర్ పార్టీ’ సినిమాలో ‘న్యాయ ఎల్లిడి’, ‘ఒమ్మే నేహే’ పాటలను తమ పర్మిషన్ లేకుండా వాడారని MRT మ్యూజిక్ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణకు రక్షిత్ హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో సైతం పాట తీసేయాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్