సీపీఎం ఎమ్మెల్యే ముఖేష్‌ అరెస్ట్

50చూసినవారు
సీపీఎం ఎమ్మెల్యే ముఖేష్‌ అరెస్ట్
మలయాళ సినీ నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ముఖేష్‌ను మంగళవారం కేరళ పోలీసులు అరెస్టు చేశారు. తనను 2009లో ముఖేష్ సహా ఏడుగురు లైంగికంగా వేధించారని బాధిత యువతి ఇటీవల ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేసి, బెయిల్‌పై విడుదల చేశారు. ఇక ఈ కేసులో విచారణ నిమిత్తం సిట్ ఎదుట ఆయన హాజరయ్యారు. ఇదిలా ఉండగా తనపై నమోదైన 2 కేసుల్లో హైకోర్టు నుంచి ఆయన గతంలో ముందస్తు బెయిల్ పొందారు.

సంబంధిత పోస్ట్