ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF)కి చెందిన శిక్షణ విమానం పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ్ మెదినీపూర్ జిల్లాలో మంగళవారం కూలిపోయింది. కలైకుండ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం నుంచి పైలట్‌లు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. నివాస ప్రాంతాల్లో విమానం కూలిపోయినా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ప్రమాదంపై IAF దర్యాప్తు ప్రారంభించింది.