జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఇచ్చి నాలుగేళ్లు అయినా ప్రభుత్వం ఎలాంటి చర్చలు తీసుకోలేదంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బాధితులకు అండగా ఉండడంకంటే వేటగాళ్ల పక్షాన నిలుస్తోందని విజయన్ సర్కారుపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆరోపణలు చేసింది. నిందితులు చేసిన నేరాల గురించి సమాచారం అందినప్పటికీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని బీజేపి ఆరోపించింది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ నెల 19న నివేదికను విడుదల చేసింది.