రోడ్డు మధ్యలో గుంతల్లో ఇరుక్కున్న కారు (వీడియో)

562చూసినవారు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ రోడ్డు కుంగిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ఓ కారు అందులో ఇరుక్కుపోయింది. గురువారం ఉదయం దాదర్ సమీపంలోని ప్రభాదేవి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయానికి సమీపంలో ఉన్న ఈ రోడ్డుపై పలు చోట్ల గోతులు ఏర్పడ్డాయి. పెద్ద గుంతలో ఒక కారు చిక్కుకుపోయింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్కడికి చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్