పాలను వేడి చేసి వాటిని ప్లాస్టిక్ బాటిల్స్‌లో పోయడం ద్వారా చిన్న పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పాల ద్వారా చిన్నారుల శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ వెళ్తుంది. ఇది వారి మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు, పిల్లల ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. రోగనిరోధక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ప్లాస్టిక్ బాటిల్స్‌కు బదులుగా స్టీల్ లేదా గాజు గ్లాసులను వాడాలి.