డీఎస్సీ పోస్టుల ఎంపికపై కీలక నిర్ణయం

78చూసినవారు
డీఎస్సీ పోస్టుల ఎంపికపై కీలక నిర్ణయం
తెలంగాణలో పలువురు డీఎస్సీ అభ్యర్ధులు 2, 3 పోస్టులకు ఎంపికవడం, వారు ఒక పోస్టులో చేరితే వందల ఖాళీలు ఏర్పడటం ప్రతిసారీ జరుగుతుంటుంది. అయితే ఇలాంటి పరిస్థితిని నివారించడానికి రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మొదటగా స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తుంది. ఆ తర్వాత SGTల జాబితా ఇస్తుంది. మొదటి జాబితాలో ఉన్నవారెవరైనా రెండో జాబితాలో ఉంటే ఆ పేరును తొలగించేలా సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేసింది.

సంబంధిత పోస్ట్