దారుణం.. కన్న కొడుకు ముందే గర్భిణిపై అత్యాచారం

83చూసినవారు
దారుణం.. కన్న కొడుకు ముందే గర్భిణిపై అత్యాచారం
రాజస్థాన్ లోని జైపూర్లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీస్ కానిస్టేబుల్ మానవత్వం మరిచి ఓ మృగంలా ప్రవర్తించాడు. మూడేళ్ల కన్నకొడుకు ముందే ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆ మహిళ గర్భిణి కావడం గమనార్హం. పొరుగింటివారిపై ఆమె భర్త ఇచ్చిన ఓ కంప్లైంటుకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డుకోసమని వారిని హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడే కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఆమె భర్తను జైలులో వేస్తానని బెదిరించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్