AP: విశాఖపట్నంలో మంగళవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. బోర ఎల్లయ్యరెడ్డి (49) అనే వ్యక్తి, పక్క ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యాంగా బాలిక (11) పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మానసిక స్థితి బాగాలేకున్న ఆ కామంధుడు కనికరం చూపలేదు. బాలిక భయంతో కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడటంతో ఈ విషయం తెలిసింది. ఈ ఘటనపై బాధితురాలు కుటుంబం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.