చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదేళ్లలో ఒక్కసారి కూడా 180 ప్లస్ టార్గెట్‌ను CSK ఛేదించలేదని భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ పేర్కొన్నారు. 'రెండు ఓవర్లలో 40 పరుగులు చేయడం చాలా కష్టం. ఎంతటి పెద్ద ప్లేయర్ ఉన్నా సరే అంత తేలికేం కాదు. ఏదోఒకటి లేదా రెండు సందర్భాల్లోనే ఇలా జరుగుతుంది. ఇలాంటి ఫీట్లు ప్రతిసారీ జరగవు. గత ఐదేళ్లల్లో 180 పరుగులను మించిన లక్ష్యాన్ని ఛేదించలేదు' అని సెహ్వాగ్ అన్నారు.