షాపింగ్ చేస్తూ గుండెపోటుతో కస్టమర్ మృతి.. షాకింగ్ వీడియో

74చూసినవారు
హైదరాబాద్ లోని KPHB PS పరిధి ప్రగతినగర్ లో మంగళవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ బట్టల షో రూమ్ లో షాపింగ్ చేస్తూ గుండెపోటుతో కస్టమర్ ప్రవీణ్ గౌడ్ (37) అనే వ్యక్తి కుప్పకూలాడు. వెంటనే షో రూమ్ సిబ్బంది గమనించి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవిలో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్