కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. అక్కడి గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించగా ఆ సమయంలో ఓ కార్యకర్త సీఎంకు షూ లేస్ విప్పారు. ఆ సమయంలో సిద్దరామయ్య ఓ చేతిలో జాతీయ జెండాను పట్టుకొని ఉన్నారు. అయితే ఆ విషయం గమనించిన మరో వ్యక్తి జాతీయ జెండాను తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.