సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎంతో మంది తమ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా, ఒక ఐటీ ఉద్యోగిని లక్షల్లో మోసగించిన సైబర్ నేరగాళ్లు, అమెరికా ట్రేడింగ్ ఖాతా సహా పలు బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసి రూ.42 లక్షలు కాజేశారు. బాధితుడి ఫోన్‌లోని వాట్సాప్ యాప్‌ను కూడా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. జరిగిన మోసంపై బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు ప్రారంభించారు.