తమిళనాడు, పుదుచ్చేరిలకు భారత వాతవరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఈ హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం తుఫానుగా మారనుందని వెల్లడించింది. ఈ తుఫాను ప్రభావంతో బుధ, గురు వారాల్లో తమిళనాడులోని మూడు జిల్లాలు, పుదుచ్చేరిలోని కారైకల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఏపీలోనూ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.