కేంద్రం రెండోసారి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ(డియర్‌నెస్ అలవెన్స్), డీఆర్(డియర్‌నెస్ రిలీఫ్) అలవెన్సులు పెంచే అవకాశం ఉంది. ఈ మేరకు 7వ వేతన సంఘం ప్రకారం వచ్చే నెలలో పెంపుదలపై ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. డీఏ 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉండడంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంటుంది. ఇక కరోనా సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ, డీఆర్ అలవెన్సులను ప్రభుత్వం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదు.