మంత్రాలయంలో రామనామ నృత్య ప్రదర్శన అంతర్జాతీయ రికార్డు పొందింది. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం, నేషనల్ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ చన్నరాయపట్నం హాసన్ సంయుక్త ఆధ్వర్యంలో మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఎదురుగా ఉన్న కారిడార్‌లో 350 మందికిపైగా కళాకారులు ఏకకాలంలో నృత్యం చేశారు. 15 నిమిషాల పాటు ‘శ్రీ రామ నామ’ పాటపై నృత్యం చేయడంతో అంతర్జాతీయ రికార్డు నమోదైంది.