దర్శన్‌ మేనేజర్ ఆత్మహత్య

69చూసినవారు
దర్శన్‌ మేనేజర్ ఆత్మహత్య
కన్నడ హీరో దర్శన్ ను ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా హీరో దర్శన్ మేనేజర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. బెంగళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగింది. ఒంటరితనం కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌తో పాటు వీడియో సందేశం కూడా లభించాయి. దర్శన్ కేసు నడుస్తున్న సమయంలోనే ఆయన మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం పోలీసులకు అనుమానాల్ని కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్