డి కాక్ ఔట్.. రేసులోకి వచ్చిన భారత్

62చూసినవారు
డి కాక్ ఔట్.. రేసులోకి వచ్చిన భారత్
టీ20 ప్రపంచ కప్‌‌ ఫైనల్‌లో కీలక సమయంలో భారత బౌలర్ అర్ష్‌దీప్ రాణించాడు. సౌతాఫ్రికా జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన డికాక్‌ (39)ను ఔట్ చేశాడు. తద్వారా 36 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. దీంతో మ్యాచ్‌‌లో భారత్ తిరిగి రేసులోకి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌తో డి కాక్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక సౌతాఫ్రికా ప్రస్తుతం 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.

సంబంధిత పోస్ట్