హరియాణాలో ఒంటరిగా పోటీ: అమిత్ షా

73చూసినవారు
హరియాణాలో ఒంటరిగా పోటీ: అమిత్ షా
ఈ ఏడాది జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నయాబ్ సింగ్ సైనీ మళ్లీ సీఎం అభ్యర్థి అవుతారని ఆయన సూచించారు. 2019లో బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో జేజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ సీట్ల విషయమై గొడవలు తలెత్తడంతో పొత్తు వీగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 5 సీట్లు గెలుచుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్