బేబీ సినిమాకి రెండు ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌!

62చూసినవారు
బేబీ సినిమాకి రెండు ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌!
హైదరాబాద్‌లోని హోటల్‌ దసపల్లా ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కార్యక్రమం జరిగింది. కళావేదిక, రాఘవి మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురళీమోహన్‌, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు హాజరయ్యారు. బేబీ చిత్రానికి గానూ ఉత్తమ కథానాయకుడిగా ఆనంద్‌ దేవరకొండకు, ఉత్తమ దర్శకుడిగా సాయి రాజేశ్‌కు ఎన్టీఆర్‌ పురస్కారం దక్కింది. భగవంత్‌ కేసరి చిత్ర నిర్మాత సాహూ గారపాటికి ఉత్తమ నిర్మాత అవార్డు దక్కింది.

సంబంధిత పోస్ట్