ఏఐ వినియోగంలో దేశం మరింత ముందుకు వెళ్లాలని ప్రధాని మోదీ సూచించారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా మోదీ పలు విషయాలపై మాట్లాడారు. ఈ క్రమంలో కృత్రిమ మేధ వినియోగం గురించి ప్రస్తావించారు. అంతరిక్ష రంగంలో ఏటా పురోగతి సాధిస్తున్నామని ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం కావడంపై అభినందనలు తెలిపారు.