RRR సినిమాలోని నాటు నాటు పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌ను నమోదు చేయడమే కాకుండా ఆస్కార్ అవార్డును అందుకుంది. అయితే దుబాయ్ వేదికగా జరిగిన సన్నిహితుల పెళ్లి వేడుకకు హాజరైన హీరో అక్కినేని అఖిల్ ఈ వేడుకలో స్నేహితులతో కలిసి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.