తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. 9 రోజుల క్రితం కనిపించకుండా పోయిన దర్శకుడు వెట్రి దురైస్వామి శవమై కనిపించారు. సట్లెజ్ నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. కాగా, ఈ నెల 4న తన స్నేహితుడు గోపినాథ్తో కలిసి దురైస్వామి హిమాచల్ పర్యటన వెళ్లారు. అక్కడ కసాంగ్ నలా ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి సట్లెజ్ నదిలో పడిపోయింది. డైవర్ మృతి చెందగా, గోపినాథ్ గాయాలతో బయటపడ్డారు.