డీమార్ట్‌కి రూ.710.37 కోట్ల నికర లాభం

84చూసినవారు
డీమార్ట్‌కి రూ.710.37 కోట్ల నికర లాభం
సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో డీమార్ట్ రూ.710.37 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.658.54 కోట్లతో పోలిస్తే లాభంలో 8 శాతం వృద్ధిచెందింది. ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ లాభం 5.6 శాతం పెరిగి రూ.659 కోట్లకు చేరుకుంది. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కార్యకలపాల నుంచి వచ్చే ఆదాయం రూ.14,050.32 కోట్లకు చేరింది. ఈ మేరకు తాజాగా కంపెనీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్