కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే. అక్కడ పుణ్య స్నానమాచరించిన అనంతరం అయోధ్యకు బారులు తీరారు. దీంతో రాత్రికి రాత్రి అయోధ్య వీధులు కిక్కిరిసిపోయాయి. బాల రాముడిని దర్శించుకొనేందుకు 96 గంటల్లోనే 65 లక్షల మంది అయోధ్య నగరంలోకి ప్రవేశించినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది. గోండా, అంబేద్కర్ నగర్, సుల్తాన్‌పుర్, లఖ్‌నవూ రోడ్ల వద్ద రద్దీని నియంత్రిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.