AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఐఐసీ ద్వారా లులూ గ్రూప్‌నకు విశాఖలో భూకేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్ రోడ్‌లోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది.