ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహా కుంభమేళా జనసంద్రంగా మారింది. గురువారం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో త్రివేణి సంగమం భక్తులతో నిండిపోయింది. అన్ని రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. విదేశాల నుంచి భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆదరిస్తుండడంతో యూపీ మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.