టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రన్నింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వికెట్ల మధ్యే కాక.. కీపింగ్ చేస్తున్న సమయంలోనూ చిరుతలా పరిగెత్తి స్టంపింగ్ చేయడం ధోనీకే సాధ్యం. ఇక ఐపీఎల్ 2025 సీజన్ దగ్గర పడుతుండడంతో ధోనీకి స్టంపింగ్‌కి సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ధోనీ 2 సెకెన్లలోనే 13 మీటర్లు పరిగెత్తి అద్భుతమైన స్టంపింగ్ చేసి మ్యాచ్‌ని గెలిపించాడు.