TG: హైదరాబాద్‌లోని సినీ సెలబ్రిటీల ఇళ్లలో రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, శిరీష్, దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహించారు. అయితే సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. పుష్ప –2 సినిమా భారీగా వసూళ్లు రాబట్టిందని, కానీ వసూళ్లకు తగ్గట్టుగా పన్నులు చెల్లించలేదని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు.