టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు ఇళ్లపై గత రెండు రోజులుగా ఐటీ రైడ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రైడ్స్‌పై నిర్మాత దిల్ రాజు స్పందించినట్లు తెలుస్తోంది. తన ఒక్కడిపైనే ఐటీ రైడ్స్ జరగటంలేదని, ఇండస్ట్రీలోని ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని దిల్ రాజు చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతుండగా ఆయన తన ఇంటి బాల్కనీలో ఉన్న వీడియో కూడా ఒకటి వైరల్ అవుతోంది.