AP: రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదలకు హడ్కో నిర్ణయించిందని మంత్రి నారాయణ ప్రకటించారు. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల కోసం సంప్రదింపులు జరిపామని, దానికి సంస్థ అనుకూలంగా స్పందించిందని ఆయన వెల్లడించారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని హర్షం వ్యక్తం చేశారు.