నిర్బంధాల మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారు: హరీశ్‌రావు

72చూసినవారు
నిర్బంధాల మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారు: హరీశ్‌రావు
నిర్బంధాల మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా గాడిచర్లపల్లిలో గ్రామసభకు హరీశ్‌రావు హాజరయ్యారు. రైతులు చనిపోతున్నా.. ప్రభుత్వానికి పట్టింపు లేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలి? దరఖాస్తు చేసిన ప్రతీసారి రూ.30, 40 ఖర్చు పెట్టాలా అంటూ విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్