సెట్‌లో డైరెక్టర్ నన్ను చెంపదెబ్బ కొట్టాడు: నటి పద్మప్రియ

79చూసినవారు
సెట్‌లో డైరెక్టర్ నన్ను చెంపదెబ్బ కొట్టాడు: నటి పద్మప్రియ
నటి పద్మప్రియ కొన్నేళ్ల క్రితం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఓ తమిళ సినిమా సెట్‌లో దర్శకుడు తనను పబ్లిక్‌గా చెంపదెబ్బ కొట్టాడని ఆరోపించారు. కానీ, ఆ సమయంలో మీడియా అందుకు విరుద్ధంగా.. తానే దర్శకుడిని కొట్టినట్లు తప్పుగా రాసిందని, ఆ కథనాలు అవాస్తవమని పేర్కొన్నారు. మంగళవారం కేరళలోని కోలికోడ్‌ జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తెలుగు సినిమా ‘శీను వాసంతి లక్ష్మి’తో ఆమె తెరంగేట్రం చేశారు.

సంబంధిత పోస్ట్