రేపు ఈ జిల్లాల్లో వానలు

60చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో వానలు
ఏపీలోని పలు జిల్లాల్లో బుధవారం వర్షాలు పడనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్