సాధారణంగా ఉప్పును ఎదుటి వారికి నేరుగా చేతికి ఇవ్వకూడదని అంటుంటారు. ఉప్పందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమేననే అర్థం వస్తుంది. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతిలోకి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు. పురాణాల ప్రకారం జ్యేష్టా దేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు కాబట్టి ఉప్పును అందుకుంటే చెడు సంక్రమిస్తుందని నమ్మకం.