హఠాత్తుగా గుండె కొట్టుకవటం ఆగటాన్ని గుండె స్తంభించడం(కార్డియాక్ అరెస్ట్) అంటారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల ఎవరైనా పడిపోతే ఈ పనులు చేయవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. "బాధితుడిని కదల్చడం, ఊపడం లాంటివి చేయకూడదు. ముఖం మీద కొట్టకూడదు. మెడను కదల్చడం లాంటివి చేయవద్దు” అని తెలిపింది. ఎవరికైనా హఠాత్తుగా గుండె స్తంభిస్తే వారిని కాపాడేందుకు సరైన విధానంలో సీపీఆర్ చేయాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.