అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు. +97, +85 కోడ్స్‌తో ఉన్న నంబర్ల నుంచి కాల్స్ వస్తే స్పందించవద్దని తెలిపారు. RBI, ట్రాయ్ పేరిట బెదిరిస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని, ఫేక్ కాల్స్‌కు స్పందిస్తే బ్యాంకు అకౌంట్స్ ఖాళీ అవుతాయని హెచ్చరించారు. ఇలాంటి స్పామ్ కాల్స్‌పై 1930కి రిపోర్ట్ చేయాలని ప్రజలకు సూచించారు.