ఆకలితో ఉన్నప్పుడు ఎలాంటి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోకూడదని స్కాట్లాండ్ లోని 'యూనివర్సిటీ ఆఫ్ దండీ' రీసెర్చర్స్ తెలిపారు. ఆకలితో ఉన్నప్పుడు డబ్బు, ఇతర అంశాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేరని వారి రీసెర్చ్ లో తేలింది. నిర్ణయాలు తీసుకునే విషయాన్ని ఆకలి ప్రభావితం చేస్తుందని, ఈ సమయంలో లాంగ్ టర్మ్ కంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఉండే డెసిషన్సే ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పారు. అందుకే కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆకలి లేకుండా చూసుకోవాలని సూచించారు.