ఆయుష్మాన్ భారత్ (AB PMJAY) కింద పేద కుటుంబాలకు కేంద్రం రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందిస్తోంది. 70 ఏళ్లు పైబడిన వారికీ ఈ బీమా కల్పిస్తోంది. దీనికి మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు https://pmjay.gov.in/ లోకి వెళ్లి 'యామ్ ఐ ఎలిజిబిల్' క్లిక్ చేయాలి. ఆపై మొబైల్ నంబర్ తో లాగిన్ అయి అక్కడ అడిగే మీ వివరాలు ఇవ్వాలి. సెర్చ్లో వచ్చిన ఫలితాల ద్వారా మీ కుటుంబానికి అర్హత ఉందో లేదో తెలుస్తుంది.