ఒక పురుషుడు రోజూ ఒక సిగరెట్ తాగే అలవాటు వల్ల, తాగని వ్యక్తులతో పోలిస్తే ఒక్కో సిగరెట్‌కు 17 నిమిషాల ఆయుష్షును కోల్పోతారు. మహిళల్లో అయితే 22 నిమిషాల ఆయుష్షు తగ్గుతుంది. ఇక రోజుకు 20 సిగరెట్లు తాగేవారిలో ఆయుష్షు 7 గంటలు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే సిగరెట్ తాగేవారిలో ఒకప్పటితో పోలిస్తే స్త్రీ, పురుషుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు రీసెర్చర్స్ పేర్కొంటున్నారు. 1996లో మహిళలు రోజుకు సగటన 13.6 సిగరెట్లు తాగేవారట.