కేసీఆర్ ప్రభుత్వంలో సజావుగా కొనసాగిన గురుకులాలు ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మసకబారుతున్నాయని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గురుకుల విద్యార్థులను ఎలుకలు కరిచి ఆసుపత్రుల పాలవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పాముకాటుకు గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వానికి చలనం లేదా? అని ధ్వజమెత్తారు.ఇప్పటికైనా గురుకులాల్లో నాణ్యమైన విద్య, భోజనం, మౌలిక వసతులు కల్పించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని హరీశ్ రావు కోరారు.