అటల్ పెన్షన్ యోజన (APY) పథకం. ఇది పదవీ విరమణ తర్వాత మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. అసంఘటిత రంగంలోని వ్యక్తులను పదవీ విరమణ కోసం పొదుపు చేసేలా ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. 18- 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయులెవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ వస్తుంది. తక్కువ వయసులో ఈ పథకంలో చేరితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు.