భారతదేశంలోని కొన్ని ఆలయాల్లో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో హిమాచల్‌లోని కాంగ్రాలో ఉన్న శ్రీ బజ్రేశ్వరి దేవి ఆలయం ఒకటి. వజ్రేశ్వరి మాత ఉన్న ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ భైరవుని ఆలయం కూడా ఉంది. పురాణాల ప్రకారం చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఆలయంలోని భైరవుని విగ్రహం కళ్ల నుంచి కన్నీరు కారుతుందని పండితులు చెబుతున్నారు. దీంతో సమస్యలు రాకుండా పండితులు ప్రత్యేక పూజలు చేస్తారట.