వర్షం కురిసే ముందు వచ్చే మట్టి వాసన ఎంత బాగుంటుందో కదా. అయితే ఈ వాసన రావడానికి అసలు కారణం మట్టి కాదని మీకు తెలుసా? యాక్టినోమోసైట్స్ అనే వర్గానికి చెందిన స్టరెప్టోమీసైట్స్ అనే బ్యాక్టీరియా కారణంగానే ఈ వాసన వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. తొలకరి వర్షంలో ఈ సూక్ష్మజీవులు మీథైల్ ఐసో బోర్నీయోల్, జయోస్మిన్ వంటి రసాయనాలను విడుదల చేస్తాయని, వాటిని మనం మట్టి వాసనగా భావిస్తామని వెల్లడించారు.