ఎక్కువ సేపు టీవీ చూస్తే మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందట. మనం టీవీ చూస్తున్నంతసేపు ఒకే చోట కూర్చుంటాం. అలా ఎక్కువ సేపు కదలకుండా ఉండటం వల్ల బరువు పెరగడం, గుండె జబ్బులు, మధుమేహం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువట. ఒక గంటసేపు టీవీ చూస్తే 22 నిమిషాల జీవితకాలం తగ్గిపోతుందని వైద్యులు అంటున్నారు. వీటికి బదులుగా ఏదైనా శారీరక శ్రమ ఉండే పనులను కల్పించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.