రాడార్ వ్యవస్థ 3 నుంచి 30 kghz రేంజ్లో తరంగాలను ప్రసారం చేస్తోంది. అయితే ఈ తరంగాలు నీటిలో 40 మీటర్ల లోతు వరకు వెళ్తాయి. అలాగే ఈ వ్యవస్థ వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి కూడా సిగ్నల్స్ చేరవేయగలదు. అందుకే తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన ఆరేబియా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో మాట్లాడటానికి వీలుగా సముద్ర మట్టానికి 360 ఎడుగుల ఎత్తున ఉన్న తెలంగాణలోని దామగుండం ప్రాంతాన్ని నేవీ ఎంచుకుంది.