పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారో తెలుసా.?

1047చూసినవారు
పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారో తెలుసా.?
'పెళ్లి' అనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు, తోడబుట్టిన వారికి దూరంగా వెళ్ళిపోతుంది. అత్తవారి ఇంటి దగ్గర కొత్త వారితో కలిసి కొత్త జీవితాన్ని పంచుకుంటుంది. అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్లడం ఎంత కష్టంగా వధువుకు కష్టంగా ఉంటుంది. ఆ కష్టం ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది. వారి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఈ ఒడిబియ్యం. ఆ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని, కూతురును మళ్లీ మళ్లీ ఇంటికి పిలిపించి కనులారా చూసుకుని, మనసారా ఆశీర్వదించి. ఆమెకు ప్రీతి పాత్రమైన దుస్తులు, పసుపు-కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని 'ఒడిబియ్యం' పోయడం అనే సంప్రదాయం పాటిస్తూ వస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్