నువ్వులతో ఎన్ని లాభాలు ఉన్నాయో.!

63చూసినవారు
నువ్వులతో ఎన్ని లాభాలు ఉన్నాయో.!
నువ్వులు వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. నువ్వులు శరీరంలోని కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. గుండె జబ్బులను రాకుండా నువ్వులు కాపాడుతాయి. నువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోజూ ఆహారంలో నువ్వులు చేర్చుకోవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతుంది. నువ్వులలోని కాల్షియం, ఐరన్, మెగ్నీషియం కండరాలను బలోపేతం చేయడంలో ఉపయోగపడతాయి. వీటిలో అధిక ప్రోటీన్, అమైనో ఆమ్లాలు ఎముక రుగ్మతలను తగ్గిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్