వంటకు మట్టి పాత్రలు ఎందుకు వాడాలో తెలుసా?

61చూసినవారు
వంటకు మట్టి పాత్రలు ఎందుకు వాడాలో తెలుసా?
మట్టి పాత్రల వాడకం అనేది చాలా ఏళ్ల నుంచి సంప్రదాయంగా వస్తోంది. మట్టి పాత్రలు వేడిని ప్రతి భాగంలోనూ సమానంగా పరుస్తాయి. దీనివల్ల ఆహారం అన్ని వైపులా సక్రమంగా ఉడుకుతుంది. మట్టి పాత్రల్లో వంట చేస్తే ఆహారం రుచి పెరుగుతుంది. కూరగాయలు లేదా ఆకుకూరలు పోషకాలను అలాగే ఉంచుతుంది. ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ ఇందులో జరగవు. అల్యూమినియం, స్టీల్ పాత్రలతో పోలిస్తే మట్టి పాత్రకు తక్కువ నూనె సరిపోతుంది. దీనివల్ల ఆరోగ్యానికి మేలు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్