గాలిమాటల గ్యారెంటీలిస్తే, మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా? అని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను
కేటీఆర్ ప్రశ్నించారు. 'కర్ణాటకలో 5 గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా? బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. ఆర్థిక సంక్షోభం తప్పదని బోధపడిందా? 6 గ్యారంటీలతో వల వేసినప్పుడు TG బడ్జెట్ గురించి తెలియదా? తెలంగాణలో
కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదు?' అని ట్వీట్ చేశారు.